Monday, 11 November 2013



చిత్రం భలారేవిచిత్రం : 
సెకనుకు 24 ఫ్రేములు నిమిషానికి 1440, కొందరు దర్శకులు ప్రెక్షకుల అలొచనలకు అనుగునంగా చిత్రాలు తీస్తే ఇంకొందరు ప్రేక్షకుల ఆలోచనల మార్పు కొసం తీస్తారు.ఎవరు ఎలా తీసినా ఒక చిత్రం ప్రభావం ఒక వ్యక్తి మీద వ్యక్తి ప్రభావం సమాజం మీద పడుతుంది, అయితే ప్రభావం మంచికా చెడుకా అన్నది మన ముందు ఉన్న ప్రశ్న ?
ఒక చిత్రాన్ని మనం చూస్తాం తరువాత అది మనకు నచ్చొచ్చు,నచ్చకపోవచ్చు. నచ్చడం వెనుక ఎన్నొ  సంభావ్యతలున్నాయి
 అవి 
1.మొదటిది మన ఆలోచనలకు అనుగుణంగా ఉండి మనలో మార్పుకు దారితీసి మార్పు సమాజం మంచికి దారి తీసేదై ఉండొచ్చు.
2.రెండవది  మన ఆలోచనలకు అనుగుణంగా ఉండి మనలో మార్పుకు దారితీసి మార్పు సమాజం చెడుకు దారి తీసేదై ఉండొచ్చు.
3.మూడవది మన అలోచనలకు అనుగుణంగా ఉన్న ఉండకపొయినా మనల్ని  3 గంటలు కేవలం ఆనందింపజేసేదై ఉండొచ్చు. 
4.నాల్గవది మన అలోచనలకు అనుగుణంగా ఉండదు అలా ఉండనప్పుడు మనలో మార్పు ఉండదు అయినా అది ఒక మంచికి దారి తీసేదై ఉండొచ్చు
వీటిలో 
మొదటి రకం చిత్రాలను జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి
రెండవది సాధ్యమైనంత త్వరగా మర్చిపోవాలి
మూడవది మూడుగంటలు అవగానే మర్చిపోవాలి 
నాల్గవ రకం కోసం మన అలోచనలు మార్చుకోవాలి ....      

No comments:

Post a Comment